టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో వినిపించే పేరు బాబు మోహన్. ఆయన పలికించే హావభావాలు.. నవ్వించే తీరు ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. కమెడియన్ గా, కొన్ని సినిమాలో హీరోగా, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అయితే ఆయన జీవితంలో విషాదం కూడా అందరికి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకును రోడ్డుప్రమాదంలో పోగొట్టుకొని ఒంటరివాడిగా మిగిలినప్పుడు ఆయన పడిన భాధను వర్ణించడం కష్టమనే చెప్పాలి.
తాజాగా ఒక షో లో పాల్గొన్న బాబు మోహన్ తన కుమారుడి మరణం తరువాత ఆయన పడిన బాధను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ” నా కుమారుడి మరణాన్ని నేను చాలా కాలం జీర్ణించుకోలేకపోయాను. ఆ సమయంలో తింటున్నానో, ఉంటున్నానో అని కూడా తెలియలేదు. ఒక అస్థిపంజరం లా తయారయ్యాను. ఆ బాధను తట్టుకోలేక రాత్రి పూట ఏడ్చేవాడిని.. ఒకానొక దశలో చచ్చిపోదామనుకున్నా” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎదిగి వచ్చిన కొడుకు హఠాత్తుగా మరణిస్తే పతల్లిదండ్రులు పడే భాద చెప్పడం కష్టమే అవుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.