Baahubali Epic : జక్కన్న చెక్కిన అద్భుతం బాహుబలి సిరీస్. రెండు సిరీస్ లను కలిపి ఈ అక్టోబర్ నెలలోనే ఒకే సినిమాగా తెస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఎపిక్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా నేపథ్యంలో రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాహుబలి-3 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి ది ఎపిక్ సినిమా చివర్లో ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు. దానిపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందంచారు. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేశారు. కాకపోతే సినిమాలో మంచి సర్ ప్రైజ్ ఉంటుందని తెలిపారు.
Read Also : Rashmika – Rukmini : రష్మికకు చెక్ పెడుతున్న సెన్సేషనల్ హీరోయిన్..
ఆ సర్ ప్రైజ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలపడంతో ఇందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియా రిపోర్టర్ తో మాట్లాడుతూ.. బాహుబలి-3 ఉంటుందనే హింట్ ఇచ్చారు. మరి ఇప్పుడు శోభు ఇలా కామెంట్ చేయడంతో మళ్లీ కన్ ఫ్యూషన్ మొదలైంది. కొన్ని సార్లు ముందే చెప్పకుండా చివర్లో సర్ ప్రైజ్ లు ఇవ్వడం జక్కన్నకు అలవాటే. మరి ఈ ఎపిక్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి హింట్ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్ లోనూ ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.