Ayalaan telugu version postponed: ఈ సారి సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైన్డవ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తేజ సజ్జా హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలకే స్క్రీన్స్ సరిపోవట్లేదంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో మరో హీరో పోటీకి రెడీ అయ్యాడు. సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతుండగా వీటితో పాటు రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా డేట్స్ ప్రకటించాయి. అలా జనవరి 12న కెప్టెన్ మిల్లర్, ‘అయలాన్’ సినిమాలు రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్, ఏలియన్స్ ఇండియాకి రావాల్సి వస్తే ఏమైంది అనే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది.
Devara: దేవర గ్లింప్స్.. సముద్రం ఎరుపెక్కాలా
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. జనవరి 12న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈ ఉదయం ప్రకటించి డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు కూడా ప్రకటించారు. ఆ వివరాల మేరకు నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనతో పాటుగా సీడెడ్‌లో ఎన్.వీ ప్రసాద్, వెస్ట్ ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక నిజానికి అయా ఏరియాల్లో వీరందరూ కూడా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్స్‌గా గుర్తింపు ఉంది. సంక్రాంతి రేసులో అయలాన్ తో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఉంది. థియటర్ల కొరత ఉండటంతో ధనుష్ తెలుగు సినిమాను వాయిదా వేశారని అంటున్నారు. ఇక శివ కార్తికేయన్ సినిమా ప్రకటనలో రేసులోకి వచ్చినట్టే అనుకున్నా చివరి నిముషంలో తెలుగు వెర్షన్ వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.