Athadu Vs Jalsa: సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని రక్తాలు వచ్చేట్టు కొట్టుకున్నారు. ఇక ఇప్పుడు అలాంటి గొడవలు ఏమి లేవు అనుకుంటా.. కొత్త ట్రెండ్ కు నాంది పలికారు ఫ్యాన్స్. అదే ఏ సినిమా గొప్ప. అవును మీరు విన్నది నిజమే.. ఒక డైరెక్టర్ తీసిన రెండు సినిమాలను పోలుస్తూ.. ఆ సినిమా గొప్ప అంటే.. ఇంకో సినిమా గొప్ప అని చెప్పుకొస్తున్నారు. అసలు ఆ రెండు సినిమాలు ఏంటి.. ? ఆ డైరెక్టర్ ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.
త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న గురూజీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాల్లో అతడు, జల్సా సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. మహేష్ బాబు, త్రిష జంటగా అతడు తెరకెక్కగా.. పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా జల్సా తెరకెక్కింది. ఇద్దరు హీరోలకు ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో అభిమానులు కొట్టేసుకుంటున్నారు. కొంతమంది అతడు బావుంటుంది అంటే ఇంకొంతమంది జల్సా అని చెప్పుకొస్తున్నారు. జల్సా కన్నా అతడునే బావుంటుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. రెండు త్రివిక్రమ్ సినిమాలే.. ఇద్దరు స్టార్ హీరోలు.. అటుఇటుగా రెండు కథలు ఒకటే అని చెప్పొచ్చు. డబ్బు కోసం హత్య చేసే హీరో అతడులో ఉంటే .. ఆ డబ్బు లేక తల్లిదండ్రులను కోల్పోయిన హీరో జల్సాలో కనిపిస్తాడు. పొలంలో హీరోను ఎలివేట్ చేసే సీన్ అతడులో ఉంటే .. అదే పొలంలో విలన్ ను ఎలివేట్ చేసే సీన్ జల్సాలో ఉంటుంది. ఇక రెండు సినిమాల్లో హీరోయిన్స్ ఎంతో అమాయకులు. అతడులో పవర్ ఫుల్ ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్ కనిపిస్తే.. జల్సాలో కామెడీ పోలీస్ గా కనిపిస్తాడు. ఇక బ్రహ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రెండు సినిమాలు హిట్టే.. కానీ, అతడు ఎక్కువగా టెలికాస్ట్ అవ్వడం,ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర అవ్వడంతో దాన్నే ఎక్కువగా అభిమానులు అభిమానిస్తున్నారు. జల్సాలో పవన్ హీరోయిజం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక మరొక విషయం ఏంటంటే.. జల్సాలో పవన్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసేది మహేష్ బాబునే. ఒక స్టార్ హీరోకు మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం అదే ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. అతడు, జల్సా తక్కువ ఎక్కువ అని చెప్పలేం. రెండు.. రెండే. ఈ రచ్చ చూసాకా.. అసలు ఎవడ్రా ఈ టాపిక్ మీద చర్చ పెట్టింది.. ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు అంటూ మిగిలిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.