Athadu Vs Jalsa: సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. బాక్సాఫీస్ నుంచి సోషల్ మీడియా వరకూ ఈ ఇద్దరు హీరోల మధ్య చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సినిమాల పరంగా రైవల్రీ ఉన్నా కూడా ఈ ఇద్దరు హీరోలకి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అండగా మహేష్.. మహేష్ కి అండగా పవన్ నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే సినీ అభిమానులు…