Appaji Ambarisha Comments on Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి నటుడు అప్పాజీ అంబరీష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న అప్పాజీ అంబరీష తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్లో తను కూడా నటించానని కథానాయకుడు సినిమా క్లైమాక్స్ లో తన పాత్ర ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో జీవన్ రెడ్డి అనే పొలిటిషన్ పాత్రలో తాను నటించానని పేర్కొన్న ఆయన అసెంబ్లీ సీన్లో మా నన్నపనేని రాజకుమారి వంటి వారు ఆయన ముందు గాజులు పగలకొట్టే సీన్ షూట్ చేస్తున్న సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఆ సీన్ లో నటిస్తున్న వారు బాలకృష్ణ ముందు గాజులు పగలగొట్టి ఉమ్మి వేయడానికి భయపడుతుంటే అప్పుడు బాలకృష్ణ ముందుకు వచ్చి ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్లీ మనం షూట్ చేస్తున్నాం.
Siddharth: ‘హైదరీ’ ప్రేమకోసం.. ఏదైనా చేస్తా!
ఇందులో మీరు భయపడాల్సిందేమీ లేదు మీరు గాజులు పగలగొట్టి నా మీద ఉమ్మి వేయండి. వేసినట్టు నటించద్దు, నిజంగానే ఉమ్మేస్తే తప్ప ఆ ఇంటెన్సిటీ రాదు అని చెప్పడంతో తాను షాక్ అయ్యానని అప్పాజీ చెప్పుకొచ్చారు. ఆ తరువాత బాలయ్యతో ఏంట్రా దమ్ముంటే రారా చూసుకుందాం అని నేను డైలాగ్ చెప్పాలి నేను చెప్పిన తర్వాత మీరు బాగా చేస్తున్నారని నన్ను అభినందించారని చెప్పుకొచ్చారు. ఈ సీన్లన్నీ ఒరిజినల్ అసెంబ్లీలోనే షూట్ చేశారు ప్యాకప్ చెప్పి బాలకృష్ణ బయలుదేరి వెళ్ళిపోయి మళ్లీ నా దగ్గరకు వెనక్కి వచ్చి వెళ్ళిపోతున్నానని అన్నారు. అదేంటి వెళ్ళిపోయారు కదా అంటే మీకు చెప్పడం మరిచిపోయానని వెనక్కి వచ్చాను అని చెప్పినట్లు అప్పాజీ చెప్పుకొచ్చారు. ఆయన గురించి విన్నదాన్ని బట్టి ఆయన కోపిష్టి అని అందరూ అనుకుంటారు కానీ ఇలాంటి వ్యక్తని ఎవరూ ఊహించని అప్పాజీ చెప్పుకొచ్చారు. వెళ్లెప్పుడు మాకు చెప్పలేదు అని మళ్ళీ చెప్పడానికి వెనక్కి వచ్చి చెప్పి వెళ్ళడం అనేది ఆయన మంచితనం, సంస్కారం ఇలాంటివి నేను ఇంకెవరి దగ్గర అబ్జర్వ్ చేయలేదని ఆయన అన్నారు.