Anushka : సీనియర్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య బయటకు రావట్లేదు. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన ఘాటీ మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగానే ఉంటుంది. ఎందుకో అర్థం కావట్లేదు. సాధారణంగా అనుష్క ఏ సినిమాలో నటించినా ప్రమోషన్లకు మాత్రం కచ్చితంగా వస్తుంది. కానీ ఘాటు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆమె కావాలనే ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ఇబ్బందికర ప్రశ్నలను తట్టుకునే బదులు.. పీస్ ఫుల్ గా ఉండాలని నిర్ణయించుకుందంట.
Read Also : Mirai : మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే
ఈ మధ్య ఇంటర్వ్యూల్లో ఎదురయ్యే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. వాటిని ఫేస్ చేయలేక ఇబ్బంది పడటం.. ఆ తర్వాత ట్రోల్స్ బారిన పడటం లాంటివి చూస్తూనే ఉన్నాం. అనుష్క కూడా వాటి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందంట. ఈ మధ్య నయనతార లాంటి సీనియర్ హీరోయిన్లు ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు అనుష్క కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. పైగా ఘాటీ కోసం కొంచెం బరువు పెరిగిన ఈ బ్యూటీ.. దాన్ని పూర్తిగా తగ్గించుకునే బిజీలో ఉందంట. కారణం ఏదైనా అనుష్క కెమెరాల ముందు కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.
Read Also : Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నందమూరి నటసింహం