Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఇప్పటికే ఈ అవార్డును సదరు సంస్థ ప్రకటించగా.. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ లో బాలకృష్ణకు పురస్కారం అందజేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాలకృష్ణను అభినందించారు.
Read Also : SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్