Anushka Shetty and Naveen polishetty to promote Miss Shetty and Mr polishetty in Bigg Boss: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి భాగమతి తర్వాత అనుష్క హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం అనే సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. దీంతో అనుష్క చాలా కాలం తర్వాత దియేటర్లకు రాబోతుందన్న మాట. ఈ సినిమా ప్రమోషన్స్ లో ముందు నుంచి నవీన్ పోలిశెట్టి మాత్రమే కనిపిస్తున్నాడు. అసలు అనుష్క సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదని కంప్లైంట్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కేవలం యాంకర్ సుమతో చేసిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే మీడియాకి రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న క్రమంలో అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.
#War2 రిలీజ్ డేట్ ఫిక్స్..మాస్ హీరోలు రచ్చ చేసేది ఆరోజే!
అయితే ఈ విషయంలో అనుష్క ప్రధానంగా టార్గెట్ అవుతున్న నేపథ్యంలో ఆమె మరొక ఈవెంట్ లో కూడా పాల్గొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గెలుస్తుంది. సెప్టెంబర్ మూడవ తేదీన నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఆరోజు గ్రాండ్ ప్రీమియర్ లో అనుష్క ఈ సినిమాని ప్రమోట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి తమ సినిమాని బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రమోట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక కేవలం వీరు మాత్రమే కాకుండా మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రేయా శరన్, రెబ్బ మోనిక జాన్, వైష్ణవి చైతన్యల డాన్స్ పెర్ఫార్మన్స్ తో పాటు రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి లైవ్ సింగింగ్ పెర్ఫార్మన్స్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.