War 2 Release date Fix: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ విలనిజం తట్టుకోవడం కష్టమే అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన క్యారెక్టర్‌ను ఆ రేంజ్ లో డిజైన్ చేశారట. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై చిత్రాల్లో భాగం రూపొందిస్తున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉండగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం మేరకు #War 2 చిత్రం 24 జనవరి 2025 న రిలీజ్ కానుంది.
Kushi: అంతా బానే ఉంది.. ఆ ఒక్కటీ సెట్ అయితే ఇక ఆపేవారే లేరు..
ఈ సినిమాలో ఎన్టీఆర్ నజీర్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. హృతిక్ రోషన్ పాత్ర కబీర్ అని అంటూ ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. వార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉంటాయి, టైగర్ ష్రాఫ్ హృతిక్ పోటీ పడి ఒక రేంజ్ లో పండించారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక వార్ 2 కంప్లీట్ అయిపోగానే, సమ్మర్‌లో ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడట ఎన్టీఆర్.