Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం దోబారా చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు చిత్ర బృందం. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వల్గర్ కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ “ఇటీవల రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ గురించి మీ అభిప్రాయం ఏంటీ..?” అని అడిగారు. అందుకు అనురాగ్ కశ్యప్ సమాధానం చెప్తూ “నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇవన్నీ సర్వసాధారణం” అని చెప్పుకొచ్చాడు. దీంతో యాంకర్ మీరు కూడా అలా ట్రై చేయొచ్చుగా అని అడిగాడు. వెంటనే తాప్సీ పన్ను నవ్వుతూ.. హర్రర్ ఫిలిం చూపిస్తారా..? ఏంటి అని చెప్పుకొచ్చింది. వెంటనే అనురాగ్ తాప్సీ కంటే నావి బిగ్గర్ b**bs అని అసూయ.. అందుకే వద్దంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఊహించని సమాధానానికి యాంకర్ షాక్ అయ్యి ఓకే ఓకే అని నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక హీరోయిన్ ముందు ఆ విధంగా వల్గర్ గా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఇక మరోపక్క తాప్సీని కూడా ఎకిపారేస్తున్నారు. రెమ్యూనిరేషన్, సినిమాల విషయంలో పురుషాధిక్యత అని మాట్లాడే ఆమె.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపకుండా ఉంది. అలాంటి మాటలకుధీటుగా సమాధానము చెప్పాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.