పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఫిబ్రవరి 25 నే సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భీమ్లా నాయక్ చిత్రం నుంచి విడుదలైన పాటల్లో అంత ఇష్టం ఏందయ్యా.. నా మీనా సాంగ్ ఎంతటి విశేషాదరణ చూరగొందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిత్యామీనన్, పవన్ కళ్యాణ్ నడుమ సాగిన ఈ పాటకి ఎంతోమంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ సినిమాలో ఉండదని టాక్. కేవలం ప్రమోషనల్ సాంగ్ గానే ఈ పాటను ఉపయోగించనున్నారట మేకర్స్ . ఇప్పటికే రన్ టైమ్ ఎక్కువ కావడంతో ఈ సాంగ్ ని తీసివేశారని టాక్ నడుస్తోంది. ఇంత మంచి మెలోడీ థియేటర్లో చూడకపోతే సినిమా చూసిన ఫీల్ రాదనీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నోరువిప్పాల్సిందే