న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది ‘అంటే సుందరానికీ’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళయళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాంతో ఈ సినిమా పై రోజు రోజుకి హైప్ క్రియేట్ అవుతోంది. నాని కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులోభాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ.. సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాడు. నాని ఫ్యాన్స్ కూడా ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత.. ‘అంటే సుందరానికి’ మూవీతో మరో హిట్ అందుకోవడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక టికెట్ రేట్లపై కూడా తనదైన స్టైల్లో స్పందించాడు నాని. గతంలో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని మాట్లాడారు.. ఇప్పుడు పెంచిన ధరలతో ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది.. అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని ప్రశ్నించగా.. నాని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నన్ను విమర్శించేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతిగా తగ్గించడం, అతిగా పెంచడం రెండూ తప్పే అని చెప్పుకొచ్చాడు.
అలాగే అప్ కమింగ్ మూవీ ‘దసరా’ 25శాతం షూటింగ్ పూర్తయిందని.. తెలుగులో వస్తున్న పవర్ ఫుల్ రా మూవీ ఇదేనని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. జూన్ 8న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్‌గా గెస్ట్ లుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు రాబోతున్నారు. అయితే ఇంకా ఆ విషయంలో క్లారిటీ రాలేదు. మరీ కంప్లీట్ ఎంటర్టైటనర్‌గా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.