మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” తెరకెక్కింది. 2019లో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ కరోనా కష్టాలు దాటుకోని 2021 నవంబర్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5కి గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తుందని మార్వెల్ లవర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
“యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమాకి సంబంధించిన కొత్త ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ బ్రాండ్ న్యూ ట్రైలర్ లో ‘కాంగ్’ వర్సెస్ ‘యాంట్ – మ్యాన్’ మధ్య ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా చూపించారు. ఆడియన్స్ ని మెప్పించగలిగితే ‘థానోస్’ తర్వాత ఆ రేంజులో ఆకట్టుకున్న విలన్ క్యారెక్టర్ ‘కాంగ్’దే అవుతుంది. అయితే “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యడం మన సినిమాలకి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17న తెలుగులో సమంతా నటిస్తున్న ‘శాకుంతలం’, ‘డీజే టిల్లు క్క్వేర్’, ధనుష్ నటించిన ‘సార్’, విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’ సినిమాలు రిలీజ్ అవనున్నాయి. యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా సినిమా ఇండియాలో భారి ఎత్తున రిలీజ్ అయితే ‘A’ సెంటర్స్ మరియు మల్టీప్లెక్స్ చైన్స్ లో శాకుంతలం మరియు సార్ సినిమాలకి హ్యుజ్ ఓపెనింగ్స్ రావడం కష్టమవుతుంది. మార్వెల్ సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా ఇంపాక్ట్ ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న తెలుగు సినిమాలపై తప్పకుండా పడుతుంది.
Marvel Studios’ #AntManAndTheWasp: Quantumania, only in theaters February 17. pic.twitter.com/dGhZ6k8get
— Marvel Studios (@MarvelStudios) January 10, 2023