బాలీవుడ్‌లో మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, కృతి ససన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్‌తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీటౌన్ ఏలేందుకు ప్రిపేరవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజైన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ రైజింగ్ స్టార్‌గా మారుతోంది.
Also Read : TheRajaSaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ టీజర్.. రికార్డ్ మిలియన్ వ్యూస్
బంటీ ఔర్ బబ్లీ2తో కెమెరా వెనుక నుండి ఫ్రంట్‌కు వచ్చి ‘ముంజ్యా’తో బాగా క్లిక్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరీ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. వేదలో మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫామెన్స్ తో క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాటిక్ యూనివర్శ్‌లో ఫస్ట్ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆల్ఫాలో నటిస్తోంది. ఆలియా భట్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అలాగే వార్ 2లో హృతిక్- తారక్‌తో భారీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండనున్నట్లే ఆల్ఫాలో కూడా ఆలియా, శార్వరి మధ్య పవర్ ఫ్యాక్డ్ డ్యాన్స్ నంబర్ ఉండేలా ప్లాన్ చేస్తోందట యశ్ రాజ్ ఫిల్మ్స్. ఇక ఇవే కాకుండా ధూమ్ 4లో ముంజ్యా బ్యూటీనే ఫైనల్ చేశారన్న టాక్ ఉంది. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఫిక్స్ అయ్యిందట శార్వరీ. బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ నెక్ట్స్ ప్రాజెక్టులో ఫైనల్ అయ్యిందట. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి నెక్ట్స్ ఏప్రిల్‌కు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లైనప్, ఈ క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారేందుకు శార్వరి దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.