Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: చాలా కాలంగా సరైన విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూర్యకు ‘కరుప్పు’ సినిమా కొత్త ఊపిరిని ఇచ్చింది. అయితే ఈ విజయం వెనుక ప్రేక్షకులకు తెలియని ఎన్నో కష్టాలు, ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కున్నట్లు సూర్య స్వయంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్జే బాలాజీ నిర్మించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు ముందే అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడటమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో షోలు కూడా రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమా విడుదలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని ఇబ్బందులను అధిగమించి చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. చాలా కాలం తర్వాత సూర్యకు బ్లాక్‌బస్టర్ హిట్ దక్కడంతో ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ‘ది హాలీవుడ్ రిపోర్టర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య మొదటిసారిగా ఆ క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. సినిమా విడుదలకు ముందు చివరి నిమిషంలోనే ఆర్థిక సమస్యలు తీవ్రరూపం దాల్చాయని ఆయన చెప్పారు. ఆ పరిస్థితుల్లో తన పరిధిని దాటి భారీ రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం సులభం కాదని, కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ సాహసం చేశానని వివరించారు. ఈ ప్రయాణంలో తన భార్య జ్యోతిక ఇచ్చిన మద్దతును సూర్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. కష్టకాలంలో తనకు ధైర్యం చెప్పి అండగా నిలిచిన వ్యక్తి జ్యోతికేనని ఆయన అన్నారు. ఒకవేళ పరిస్థితులు మరింత దిగజారిపోయి ఉంటే, ఆ పరిణామాలను మొత్తం కుటుంబం కలిసి ఎదుర్కోవాల్సి వచ్చేదని కూడా ఆయన పేర్కొన్నారు. చివరకు ఆ రిస్క్ ఫలించి సినిమా విజయం సాధించడంతో అన్ని సమస్యలు సద్దుమణిగాయని సూర్య ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
- Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్‌కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
- Kavya Maran - Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
- Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
సూర్య వ్యాఖ్యలకు స్పందించిన జ్యోతిక కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్ణయానికి తనకు ప్రత్యేకంగా క్రెడిట్ అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబంగా తాము ఎప్పుడూ ఒకటిగానే ఉంటామని, ఏ సమస్య వచ్చినా కలిసి ఎదుర్కోవడమే తమ బలం అని చెప్పారు. జీవితంలో కష్టసుఖాలను పంచుకోవడం దంపతుల బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య తన ఆనందాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించి భారీ లాభాలు తీసుకురావడంతో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో పాటు ఎడిటర్‌కు విలాసవంతమైన కార్లను బహుమతిగా అందించి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 2026 ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘కరుప్పు’ విజయంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సూర్య, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!