ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల…