కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే యాక్షన్ డ్రామా “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, జాతీయ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్, మీనా మరియు ఖుష్బూ హీరోయిన్లుగా నటించగా, సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉంది. సినిమాటోగ్రఫీని వెట్రి నిర్వహిస్తుండగా, రూబెన్ ఎడిటింగ్ విభాగాన్ని చూసుకుంటున్నారు. ఈమూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కొన్ని ప్యాచ్‌వర్క్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Read Also : ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పై ఓపెన్ అయిన దేవ కట్టా!
మేకర్స్ తాజా ప్రకటన ప్రకారం “అన్నాత్తే” ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్, సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సూపర్ స్టార్ అభిమానులు డబుల్ ట్రీట్ తో వినాయక చవితి సంబరాలను మరింత స్పెషల్ గా జరుపుకోనున్నారన్న మాట. ఇక “అన్నాత్తే” మొదటి కాపీని చూసిన తరువాత రజనీకాంత్ ఫస్ట్ రివ్యూను పంచుకున్నారు. “ఈ చిత్రం ప్రతిఒక్కరినీ మానసికంగా కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలను ఆకర్షిస్తుంది” అని తెలిపారు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ డ్రామా.
#Annaatthe thiruvizha aarambam!#AnnaattheFirstLook Tomorrow @ 11 AM | #AnnaattheMotionPoster Tomorrow @ 6 PM@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals #AnnaattheFLTomorrow pic.twitter.com/RTOr8SFqWE
— Sun Pictures (@sunpictures) September 9, 2021
కామెడీ, భావోద్వేగాలతో నిండి ఉండే ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక గ్రామ పెద్దగా కనిపిస్తారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రజనీకాంత్ నటించిన ఈ చిత్రం తల అజిత్ కుమార్ యాక్షన్ డ్రామా “వాలిమై”తో బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతుందని భావిస్తున్నారు.ప్రస్తుతానికి ఇవి కేవలం రూమర్స్ అయినప్పటికీ “వాలిమై” నుంచి అనుకున్నట్టుగా ప్రకటన వచ్చిందంటే మాత్రం కోలీవుడ్ లో ఓ బిగ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ కు రంగం సిద్ధమైనట్టే.