ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా……
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే యాక్షన్ డ్రామా “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, జాతీయ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్, మీనా మరియు ఖుష్బూ హీరోయిన్లుగా నటించగా, సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉంది. సినిమాటోగ్రఫీని వెట్రి నిర్వహిస్తుండగా,…