మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా తమిళ నటుడు SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక పాత్రలలో కనిపించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు నుండి నెగిటివ్ టాక్ అందుకుంది.
Also Read : Laila : అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో రిలీజ్
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి తాజాగా ఆమె నటించిన మదగజరాజ జనవరి 31న రిలీజ్ కాబోతున్ననేపథ్యంలో తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజలీని గేమ్ ఛేంజర్ రిజల్ట్ గురించి ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ ‘యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీని మాత్రమే తీసుకోగలను కదా. నన్ను నమ్మి నా పాత్రను డిజైన్ చేసినపుడు దానికి మనం 100 శాతం పని చేశామా లేదా అనేదే నా భాధ్యత. అంతే కానీ సినిమాని నేను ఆడించలనేది నా తపన. దానికోసం మూవీ ప్రమోషన్స్ చేయడం, ఆడియెన్స్ దగ్గరకు వెళ్లడం సినిమా గురించి చెప్పడం అవన్నీచేసాము. గేమ్ ఛేంజర్ చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ కూడా సినిమా బాగోలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూసాం అని నాకు చెప్పారు. ఒక సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ ఛేంజర్ మంచి సినిమా నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. నాకు అది చాలు మిగిలిన వాటితో నాకు పని లేదు’ అని అన్నారు.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై హీరోయిన్ అంజలి రియాక్షన్ #GameChanger #RamCharan #Vishal #Madhagajaraja #Anjali #VaralaxmiSarathkumar #NTVENT pic.twitter.com/k3OyobKDqM
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) January 27, 2025