మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా ఈ విశ్వక్ ఈసినిమాలో ని లైలా గెటప్ లోకి మారేందుకు ఎంత కష్టపడ్డాడో మేకర్స్ మేకింగ్ వీడియో ను విడుదల చేసారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. క్యారక్టర్ కోసం విశ్వక్ ఎంత డెడికేషన్ పెట్టాడో తెలుస్తోంది. లైలాగా కానిచడం కోసం ప్రత్యేక శ్రద్ద వహించి డెడికేషన్ గా వర్క్ చేసాడు విశ్వక్. ఫైనల్ లుక్ లో విశ్వక్ ను చూసి యూనిట్ మొత్తం కరచాల ధ్వనులతో ప్రత్యేకంగా అభినందిచారు. అయితే అసలు విశ్వ అమ్మాయి లాగా ఎందుకు మారాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలన్నారు మేకర్స్. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవల విడుదల చేసిన సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. యంగ్ సెన్సేషన్ లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రానున్న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.