Jamal Kudu Song Origin: ఇప్పుడు ఏ సోషల్ మీడియా మాధ్యమం ఓపెన్ చేసినా… ఆ పాటే వినిపిస్తుంది.. సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకు జమాల్ జమాల్ అంటూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. అంతలా ఊపు ఊపేస్తున్న జమాల్ సాంగ్.. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాలోనిది. అయితే ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ జమాల్ కుడు సాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు ఈ పాట మన ఇండియాది కాదని తెలుస్తోంది. జమాల్ కుడు సాంగ్ నిజానికి ఇరానియన్ సాంగ్ కాగా.. దీన్ని ప్రముఖ ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. ఈ పాట ఇప్పటిది కాదు.. 1958లోనే బయటకు రాగా… అప్పటి నుంచి ఈ పాటను ఇరాన్ లో జరిగే పెళ్లి వేడుకల్లో ప్లే చేస్తూ ఉంటారని తెలుస్తోంది.
Big Breaking: రైతు బంధు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
ఇక ఈ పాటను 1977 సంవత్సరంలో అనౌశిర్వాన్ రోహాని అనే మ్యూజిక్ డైరెక్టర్ రీమిక్స్ చేయగా.. ఇప్పుడు తాజాగా యానిమల్ మూవీలో దర్శకడు సందీప్ ఈ రీమిక్స్ పాటనే వాడాడు. యానిమల్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన హర్ష వర్ధన్.. ఈ పాటను కొంతమంది పిల్లలతో పాడించాడు. ఇక ఇప్పుడు ఈ పాట దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటించారు. అయితే ఆయన ఎంట్రీ టైంలోనే ఈ పాట ప్లే అవుతూ ఉంటుంది. ఇక ఈ పాటను ఇటీవల మేకర్స్.. యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తుంది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండగా.. ఇప్పటి వరకు 28 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అంతే కాదు.. ఈ పాట ట్రెండింగ్ సాంగ్స్ లో టాప్ లో ఉంది.