Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా అనిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. అనిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రతి జనరేషన్ కు ఒక డైరెక్టర్.. తన విజన్ తో కొత్త మార్పు తీసుకొస్తాడు. సందీప్.. ఇప్పుడు అదే చేశాడు. అసలు ఒక సినిమా ఎంత వైలెంట్ గా ఉండాలో అంత వైలెన్స్ ను ఇందులో చూపించాడు. ఎవరికి తన సినిమాలు నచ్చినా, నచ్చకపోయినా.. ప్రేక్షకులు ఆదరిస్తే చాలని చెప్పుకొస్తూ ఉంటాడు. ఇక మొదటి నుంచి కూడా సందీప్ రెడ్డి.. ఒక వైల్డ్ మ్యాన్ లానే కనిపిస్తాడు. పొడవైన జుట్టు.. గుబురు మీసాలు.. గుబురు గడ్డం. ఇప్పటివరకు సందీప్ ను.. గడ్డం లేకుండా చూసి ఉంటాం కానీ, మీసాలు, జుట్టు లేకుండా చూడలేదు కదా.. అయితే ఇప్పుడు చూడండి.
నేడు సందీప్ రెడ్డి వంగా తిరుమలలో సందడి చేశాడు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించాడు. తలనీలాలు సమర్పించి.. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. ఇక ఈ లుక్ లో సడెన్ గా ఎవరైనా సందీప్ ను చూస్తే .. నిజంగా అర్జున్ రెడ్డి, అనిమల్ తీసింది ఇతడేనా అనిపించకమానదు. ఇండస్ట్రీనే తన సినిమాలతో గడగడలాడించిన వ్యక్తి.. ఇంత శాంతంగా కనిపిస్తున్నాడు ఏంటి అని అనుకోక మానరు కూడా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సందీప్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.
Next PRABHAS – #Spirit – #SandeepReddyVanga 🔥🔥🔥🔥
— GetsCinema (@GetsCinema) March 6, 2024