Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. సుకుమార్ తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర దీని వెనకాల ఉన్న విషయాలను పంచుకున్నారు. ఆయన తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. నేను మహేశ్ బాబుతో సినిమా తీయాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో దూకుడు సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాను. ఆ తర్వాత మా కాంబోలో వచ్చిన మూవీ 1 నేనొక్కడినే. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా హిట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ పూర్తి ఔట్ పుట్ చూసిన తర్వాత నాకు ఎక్కడో తేడా కొట్టింది అంటూ చెప్పుకొచ్చారు అనిల్ సుంకర.
Read Also : Prabhas : మంచు ఫ్యామిలీకి అండగా ప్రభాస్.. గొప్పోనివయ్యా..
కానీ మిగతా అందరూ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నాకు ఒక్కడికే ప్లాప్ అవుతుందని అర్థమైంది. ఎందుకంటే అంత పెద్ద హీరోకు ఏదో ప్రాబ్లమ్ ఉందంటే ఫ్యాన్స్ తీసుకోగలరా అనిపించింది. ఆ మూవీ కోసం ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ ఏదో యాక్షన్ సీన్లతో రిలీజ్ చేసేసరికి.. అది చూసిన వారంతా జేమ్స్ బాండ్ రేంజ్ లో ఊహించుకున్నారు. అంచనాలు భారీగా ఉండటం కూడా తేడా కొట్టింది. ఒకవేళ ట్రైలర్ లో హీరో లోపం గురించి చెప్పి ఉంటే ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ అయి సినిమాకు వెళ్లేవారేమో. కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది అంటూ తెలిపారు అనిల్ సుంకర. మహేశ్ బాబుతో అనిల్ తర్వాత తీసిన ఆగడు మూవీ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.
Read Also : Mirai : నాతో సినిమాలు చేయొద్దని చెప్తున్నారు.. మనోజ్ ఎమోషనల్..