Mirai : మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ లో మనోజ్ విలన్ పాత్రతో అదరగొట్టాడు. ఆయనకు ఇందులో పవర్ ఫుల్ పాత్ర పడింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాతో మూవీ టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. 12 ఏళ్లు అయింది నేను సక్సెస్ ను చూసి. నన్ను కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తావ్ అని చాలా మంది అడుగేవారు. త్వరలోనే అని చెబుతూ వచ్చాను. ఈ సినిమాతో అది తీరిపోయింది. మూడేళ్ల క్రితం ఈ సినిమాకు ఓకే చెప్పాను.
Read Also : Mirai : అతను నా కుటుంబాన్ని నిలబెట్టాడు.. మనోజ్ ఎమోషనల్
నిర్మాత విశ్వ ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ సినిమా నాతో చేయొద్దని చాలా మంది చెప్పినా ఆయన వినిపించుకోలేదు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు నిజంగా హ్యాట్సాఫ్. కార్తీక్ ఘట్టమనేని నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చాడు. అతనికి జన్మంతా రుణపడి ఉంటాను. ఈ మధ్య చాలా మంది నాతో సినిమాలో చేయొద్దని చెబుతున్నారు. దాంతో నా చేతుల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు మిస్ అవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడూ నిరాశ పడలేదు. ఎందుకంటే విశ్వ ప్రసాద్ లాంటి వారు నన్ను నమ్ముతున్నారు. ఎంత మంది నన్ను వ్యతిరేకించినా నేను పట్టించుకోను అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్. మిరాయ్ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు మనోజ్. ఆయన పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి.
Read Also : Samantha : అవన్నీ శాశ్వతం కాదు.. రిలేషన్ పై సమంత షాకింగ్ కామెంట్