మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా ప్రయాణంలో ఇది తొమ్మిదో సినిమా. ఎనిమిది సినిమాలు తర్వాత డైరెక్ట్‌గా మెగాస్టార్ దగ్గరకు వచ్చి ల్యాండ్ అయ్యాను. నిర్మాత సాహూ తో నాకు ఇది రెండో సినిమా. అతను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా అయిపోయాడు. నేను చాలామందిని చూశాను కానీ చిరంజీవి గారి కూతురు అయ్యుండి కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటుందో చెప్పలేను. హ్యాట్సాఫ్ టు సుస్మిత గారు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్ కోసం అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు ఆయన ఉండాల్సింది కానీ పవర్‌సిస్ కాపీస్ ఇవ్వడం కోసం ఇంకా ఆయన పని చేస్తున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చావు. ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు. నేను స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురు. అందులో ముందుగా నయనతార గురించి మాట్లాడాలి.
Also Read:Raja Saab: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్..
నయనతార గురించి చెప్పాలంటే ముందు ఆమె చేసిన సపోర్ట్. మాకు స్ట్రైక్ వల్ల రెండు నెలలు డిలే అయినా కూడా కంటిన్యూ డేట్స్ ఇచ్చి తను హైదరాబాద్‌లో ఉండి పిల్లలతో కలిసి మాకు చాలా సపోర్ట్ చేసింది. ఆవిడ మాకు రెండు ప్రమోషన్స్ చేసింది. నిజానికి ఈరోజు ఊర్లో లేదు, విదేశాల్లో ఉంది. ఉంటే కనుక కచ్చితంగా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. అలాగే ఇంకో వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. ఆయన నాకు ఫ్రెండ్, గైడ్, ఇంకా అన్నిటికంటే ఎక్కువ. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇది వెంకటేష్ గారితో నాకు నాలుగో సినిమా. ఆయనతో నాకు ఉన్న సింక్ గాని, ఫ్రెండ్‌షిప్ గాని… నాకు ఎప్పుడు కావాలన్నా ఆయన ఉన్నారు.
Also Read:Draupadi 2: ‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి..’ సాంగ్ రిలీజ్..
పాజిటివిటీకి సిగ్నల్ పెడితే 5జి కి 100జి మీ దగ్గరే ఉంటుంది. అంతా పాజిటివ్ పర్సన్ మీరు. అలాగే ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎక్సైటెడ్‌గా చెబుతున్నారు. నాకు ఒక అదృష్టం అని చెప్పాలి నాకు ఈ అవకాశం రావడం. వెంకటేష్ గారు ఈ సినిమాలోకి రావడానికి మూల కారణం చిరంజీవి గారు. ఈ కథలో ఇలాంటిదే ఏదైనా ఉంటే బాగుంటుందేమో చూడమని చిన్న ఒత్తి వెలిగించి బాంబ్ లాస్ట్ అయ్యేలా చేశారు. వెంకీ గౌడ్ ఫ్రమ్ కర్ణాటక అనే పాత్రలో ఈ సినిమాలో చేస్తున్నారు. చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్‌లో సినిమా చేయించాలని ఎంతోమంది ప్రయత్నించారు కానీ అది నాకు కుదిరింది. ఈ సినిమాలో ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసేసాను, గోల చేసేసాను.. అంటూ సినిమా గురించి మరింత మాట్లాడారు.