Draupadi 2: రిచర్డ్ రిషి హీరోగా నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ సినిమాలో రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహ్మబీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చిత్ర దర్శకుడు మోహన్.జి రాసిన ఈ పాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు.
READ ALSO: EPF Wage Ceiling Hike: ఈపీఎఫ్ వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి..
ఇంకా ఈ చిత్రంలో నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా..వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.
READ ALSO: Anil Ravipudi Father: ఇది కదా అసలైన పుత్రోత్సాహం!