Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచనాలు పెంచేసి థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ విషయం బాగానే వంట పట్టించుకున్న అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్ మొదలు పెట్టాడు. అసలు సినిమాల షూటింగ్ అయిపోయాక రిలీజ్ కు 20 రోజుల ముందు ప్రమోషన్లు చేయడం ఎందుకు.. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే ప్రమోషన్లు ఎందుకు చేయొద్దు అనేది ఆయన థాట్.
Read Also : Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?
ఎలాగూ సినిమా గురించి అప్డేట్లు ఇవ్వక తప్పదు కదా. దాన్ని నార్మల్ గా ఇవ్వడం ఎందుకు.. కొత్త తరహాలో ఇస్తే అదే ప్రమోషన్ అయిపోద్ది అనేది అనిల్ ఐడియా. అందుకే ఎఫ్-3 నుంచే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే ప్రమోషన్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చిరుతో చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ప్రతి అప్డేట్ ప్రమోషన్ రూపంలోనే చేసేస్తున్నాడు. దీంతో మూవీ గురించి ఎప్పుడూ ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇదే ట్రెండ్ ను మిగతా సినిమా వాళ్లు కూడా ఫాలో అయితున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం చేస్తున్న ‘K- ర్యాంప్’ గ్లింప్స్ అనౌన్స్ ను కొత్త వీడియోతో చేసి అదరగొట్టాడు. మొన్నటికి మొన్న తమ్ముడు సినిమా అప్డేట్లు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐడియాలతో చేశారు. అంతకు ముందు వరుణ్ తేజ్ చేస్తున్న మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఇలాగే చేశారు. రాబోయే సినిమాలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తానికి అనిల్ సెట్ చేసిన ట్రెండ్ బాగానే వర్కౌట్ అవుతోంది.
Read Also : OG : ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..