ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి చెరువులు, కట్టలు తెగిపోయి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలు ప్రజలు జీవనోపాధిని కోల్పోయేలా చేశాయి. కొంతమంది అయితే ఏకంగా గూడు, కూడును కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు, విపత్తు ప్రతిస్పందన దళం, మున్సిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లో 24 గంటలు పని చేస్తున్నారు.
Read Also : మహేష్ బాబుకు సర్జరీ… “సర్కారు వారి పాట”కు బ్రేక్ ?
వర్షాల కారణంగా ఏపీలో అనేక మంది జీవితాలు దెబ్బతిన్నాయి. ఈ కష్ట సమయాల్లో ప్రజలకు సహాయం చేయడానికి సినీ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఆంధ్రాలో వచ్చిన భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని, వాళ్లకు తన తరపున సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక నిన్న చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు వరుసగా 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించిన మొదటి సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్. తర్వాత మహేష్, చిరంజీవి ఈ విషయంపై స్పందించారు.