Anchor Suma getting trolled for interviewing Rakshith Shetty without Preparation: ఈ మధ్యకాలంలో సుమ అనూహ్యంగా వార్తల్లోకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అది మరిచిపోక ముందే ఆమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా నెటిజనులకు అడ్డంగా దొరికేసింది. అసలు విషయం ఏమిటంటే రక్షిత్ శెట్టి హీరోగా సప్త సాగరాలు దాటి సైడ్ఏ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైడ్ ఏ సినిమాకి సినిమా యూనిట్ గట్టిగా ప్రమోట్ చేసింది. హైదరాబాద్ కూడా వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంది. మరి సైడ్ బీ సినిమాకి పెద్దగా టైం లేదనుకున్నారో లేక కన్నడ బెల్ట్ లో ప్రమోషన్స్ ఎక్కువగా చేయాలి అనుకున్నారో తెలియదు కానీ తెలుగు ప్రమోషన్స్ విషయంలో మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుమ తోటి ఒక ఇంటర్వ్యూ చేసి వదిలారు మేకర్స్. ఈ ఇంటర్వ్యూకి సుమ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్లి సోషల్ మీడియా నెటిజన్ల దృష్టిలో పడింది.
Mangalavaaram: ఒక హీరోను భలే దాచారు మావా!
ఈ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా మీరు స్టోరీ రాసినప్పుడే ఇలా రెండు పార్ట్స్ అనుకున్నారా అని అడిగితే తాను ఈ సినిమాకి రైటర్ ని కాదని హీరోని మాత్రమేనని ఈ సినిమా రాసింది హేమంత్ అని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఈ సినిమా రెండు పార్ట్స్ అంటే ప్రొడ్యూసర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారా అని అడిగితే ప్రొడ్యూసర్ రియాక్ట్ అయ్యేదేముంది నేనే కదా ప్రొడ్యూసర్ అంటూ రక్షిత్ మరో షాకిచ్చాడు. ఆ తర్వాత మీ కెరీర్ లో మీరు రైటర్ గా, నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా కూడా వ్యవహరించారు అనబోతుండగా మిగతావన్నీ ఓకే గాని నేనేం సింగర్ని కాదే, నేను ఒక పాట కూడా పాడలేదు అంటూ మరో షాకిచ్చాడు. ఇలా ఇంటర్వ్యూలో మరిన్ని కౌంటర్లు రక్షిత్ శెట్టి సుమకు వేసినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుమక్క మరీ ఏంటి ఇలా దొరికిపోయావ్, ఆ మాత్రం ప్రిపరేషన్ కూడా లేకపోతే ఎలా అంటూ సుమక్క మీద ట్రోల్స్ వర్షం కల్పిస్తున్నారు.