Mangalavaaram Movie Unit Cleverly hid Priyadarshi From Promotions: ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి మంచి హిట్ అందుకున్నాడు. వర్మ శిష్యుడిగా అందరికీ పరిచయం అయిన అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా చూసి తెలుగు సినీ పరిశ్రమకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా పెద్ద దెబ్బేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమా అనౌన్స్ చేశాడు అజయ్ భూపతి. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు సినిమాకి ఇలాంటి టైటిల్ కూడా పెడతారా? అని అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పాయలు రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుంది అనగానే ఆర్ఎక్స్ 100 కి ఉన్న క్రేజ్ కారణమా ఈ సినిమా మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలు భారీగా పెరిగే విధంగా పాయల్ రాజ్పుత్ బోల్డుగా ఉన్న కొన్ని సీన్స్ తో పాటు కొన్ని పోస్టర్లు కూడా వదలడంతో ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ నమ్మారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు ఎవరు? అనే విషయాన్ని ముందు నుంచి క్లారిటీగానే చెబుతూ వచ్చారు కానీ ఒక హీరోని మాత్రం దాచేశారు.
My Name Is Shruthi Review: మై నేమ్ ఈజ్ శృతి రివ్యూ
సినిమా చూసిన వారందరూ ఒక్కసారిగా అతని స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోయారు. అతను ఎవరో కాదు బలగం సినిమాతో హీరోగా మారి హిట్టు కొట్టిన ప్రియదర్శి పులికొండ. మంగళవారం సినిమాలో రవి అనే పాత్రలో పాయల్ రాజ్పుత్ సరసన ఆమెను ప్రేమించే వ్యక్తిగా ప్రియదర్శి కనిపించాడు. సినిమా యూనిట్ అసలు ప్రియదర్శి సినిమాలో భాగమైన విషయాన్ని కూడా ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం థియేటర్లలో మాత్రమే రివీల్ చేసి ఒక్కసారిగా అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఎందుకో ఆ పాత్రకి ప్రియదర్శి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. ఇదే పాత్రలో పేరు ఉన్న మరో నటుడిని లేదా హీరోని తీసుకొని ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. మరీ ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయను రంగంలోకి దింపినా సినిమా రిజల్ట్ మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎందుకో ప్రియదర్శని మాత్రమే ఎంచుకుని ఆయనను ఈ సినిమాలో ఒక హీరో లాంటి పాత్రలో నటింప చేశారు. అయితే ఈ విషయంలో సినిమా యూనిట్ తీసుకున్న జాగ్రత్త మాత్రం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న సినిమాలకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. కానీ ప్రియదర్శి ఈ సినిమాల్లో హీరో లాంటి పాత్రలో నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా చాలా పగడ్బందీగా సినిమా యూనిట్ వ్యవహరించిందని చెప్పొచ్చు.