బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి అల్లరి ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. షూటింగ్ లేని సమయంలో, షూటింగ్ గ్యాప్ సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. శ్రీముఖి హిడెన్ ట్యాలెంట్ లో సింగింగ్ ఒకటి. ఇటీవల ఓ షో లో ఆ ట్యాలెంట్ ని కూడా బయటపెట్టి ఔరా అనిపించినా విషయం తెలిసిందే. అయితే తాజాగా తన సింగింగ్ ట్యాలెంట్ తో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇదంతా నిజం కాదులే.. ఒక రీల్ కోసం శ్రీముఖి, నాగబాబు ఇలా కనిపించారు.
నాగబాబు ప్రేమగా శ్రీముఖి నా కోసం ఒకటి చేస్తావా.. అని అడిగితే.. మీరు అడిగితే చేయనా బాబుగారు అంటూ సమాధానం ఇస్తుంది.. వెంటనే నాగబాబు గోముగా నీ నోటి నుంచి ఒక పాట వినాలని ఉంది అని అడుగుతారు.. దానికి శ్రీముఖి సిగ్గుపడుతూ ఒక పాట అందుకుంటుంది. గట్టిగా ఆమె అరిచిన అరుపుకు నాగబాబు గుండె జారిపోయి స్పృహ కోల్పోతాడు.. ఇందుకు సంబంధించిన వీడియో శ్రీముఖి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, దీనికి కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ కూడా స్వీట్ పర్సన్ నాగబాబుగారిదే అంటూ చెప్పుకొచ్చింది. శ్రీముఖి గొంతు గురించి తెలిసి కూడా నాగబాబు గారు పాడమని ఎలా అడిగారు అని కొందరు.. అమ్మో మనిషిని ఈ రకంగా కూడా చంపొచ్చా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.