Esha Gupta : సినిమాల్లో రొమాంటిక్ సీన్లు అనేవి ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇలాంటివి చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా అలాంటివి చేస్తేనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటాం అంటూ చెప్పడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా గుప్తా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె 2022లో వచ్చిన ఆశ్రమ్ సీజన్-3 వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో బాబీ డియోల్ తో ఆమె చేసిన రొమాంటిక్ సీన్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ రేంజ్ లో ఆమె రెచ్చిపోయింది మరి. తాజాగా ఆ సీన్లపై ఆమె మాట్లాడుతూ సమర్థించుకుంది.
Read Also : Diabetes: ఉప్పు ఎక్కువగా వాడితే మధుమేహం!
‘సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో ఇంటిమేట్ సీన్లు చేయడానికి అసలు సిగ్గెందుకు. అన్ని సీన్లు చేసినప్పుడే నటిగా మనం సంపూర్ణం అవుతాం. పైగా నేను అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయిపోతోంది. ఇంకా అలాంటి సీన్లు చేయడానికి నాకెందుకు నామూషీగా ఉంటుంది. పైగా బాబీ డియోల్ కూడా అలాంటి సీన్లు గతంలో చేసే ఉంటారు. ఇంకా చెప్పాలంటే నాతో ఆయన చాలా సపోర్టివ్ గా చేశారు. ఆయన అద్భుతమైన నటుడు. మా మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఆ సీన్ లో చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ. ఆమె తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.