బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. అమ్మడి అందచందాలకు అటు బుల్లితెర అభిమానులే కాదు వెండితెర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మీ పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది. అయితే గతకొన్నిరోజుల నుంచి రష్మీ గురించిన రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే రష్మీ- సుధీర్ కి మధ్య రిలేషన్ ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, తాము స్టేజిపైనే వరకే లవర్స్ లా నటిస్తున్నామని ఎన్నోసార్లు చెప్పారు. అయితే తాజాగా రష్మీ గురించి మరోవార్త హల్చల్ చేస్తోంది.
కరోనా సమయంలోనే రష్మీకి పెళ్లి అయిపోయిందట. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో వివాహం అయ్యిందని, కానీ, తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్నీ రష్మీ సీక్రెట్ గా ఉంచిందని టాక్. రష్మీ భర్త ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే ఈ వార్తలపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. కెరీర్ కోసం వివాహాన్ని దాచేయడం అలవాటు అయిపోయింది. అంతకుముందు యాంకర్ రవి.. ఇప్పుడు రష్మీ అని కొందరు అంటుండగా.. మరికొందరు సుధీర్ పరిస్థితి ఏంటీ ఇప్పుడు అని విచారిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే రష్మీ ఓపెన్ కావాల్సిందే..