యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది అని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. యాంకర్ గా అనసూయ స్టామినా ఎలాంటిదో అందరికి తెలిసిందే.. కొన్ని షోలలో అమ్మడు ఆరబోసే అందచందాల వలనే రేటింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనసూయ.. ఒక దౌ కి హోస్ట్ గా చేసినా కూడా రేటింగ్ రావడంలేదని యాజమాన్యం వాపోతున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి అనేగా..’మాస్టర్ చెఫ్ తెలుగు’.. మిల్కీ బ్యూటీ తమన్నాతో గ్రాండ్ గా ఓపెన్ చేసిన ఈ షో కొన్నిరోజులు ఆహా ఓహో అనిపించినా ఆ తరువాత ఆశించినంత ఫలితాన్ని అయితే రాబట్టలేకపోయింది.
ఇక ఇదంతా తమన్నా వల్లే అనుకున్న యాజమాన్యం ఆమెను తొలగించి ఆమె ప్లేస్ లో అనసూయను తీసుకున్నారు. అమ్మడి వాక్చాతుర్యం, అందచందాలు కలగలిపి ఈ షో రేటింగ్స్ పీక్స్ కి తీసుకెళ్తాయనుకున్నారు. కానీ, ఇక్కడ కూడా వారు బోల్తా పడ్డారు. కనీసం తమన్నా ఉన్నప్పటికన్నా ఇప్పడూ మరింత దారుణంగా రేటింగ్ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకొని అనసూయకి భారీ పారితోషికం ఇచ్చి మరీ ప్రోగ్రాం స్టార్ చేసిన మాస్టర్ చెఫ్ యాజమాన్యానికి షాక్ తగిలింది. దీంతో ఈ ప్రోగ్రాం ని కొద్దిరోజుల్లోనే మూసేయనున్నారని తెలుస్తోంది. నష్టాల్లో కొనసాగుతూ ఈ ప్రోగ్రాం ని ముందుకు తీసుకెళ్లలేమని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఒక లెక్కలో చెప్పాలంటే ఇది అనుసూయకు అవమానమే.. స్టార్ యాంకర్ గా.. ఆమె ఏ షో చేసినా హిట్ అని తెలిపితే.. మరి ఈ షో పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది అనేది ప్రశ్నగా మారింది. అందుకే ఇది ఖచ్చితంగా హాట్ బ్యూటీకి అవమానమే అని నెటిజన్లు భావిస్తున్నారు.