Janhvi Kapoor : గ్లామర్ డాల్ జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్లకు చాలా గిఫ్టులు వస్తుంటాయి. వాళ్లను అభిమానించే వాళ్లు లేదంటే వారితో సినిమాలు చేసే నిర్మాతలు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ రూ.5 కోట్ల కారు ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తారా.. కానీ జాన్వీకి మాత్రం ఇచ్చారు. లగ్జరీ లంబోర్గిని కారును ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడం సెన్సేషన్ గా మారిపోయింది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదండోయ్.. సింగర్, ఎంటర్ ప్రెన్యూర్ అయిన అనన్య బిర్లా. ఇండియా రిచెస్ట్ పర్సన్ కుమార్ మంగళం-నీరజ బిర్లాల కూతురు. ఆమె బాలీవుడ్ లో సింగర్ చేస్తూనే ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తోంది.
Read Also : Dhanush: మరో సినిమా అనౌన్స్ చేసిన ధనుష్.. ఎలా సాధ్యమవుతుందబ్బా?
ఇప్పటికే చాలా బ్రాండ్స్ ను ఆమె లాంచ్ చేసింది. ఆమెకు జాన్వీకపూర్ తో మంచి అనుబంధం ఉంది. అందుకే కారును గిఫ్ట్ గా జాన్వీ ఇంటికి పంపించింది. ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి రూ.5కోట్ల విలువైన లంబోర్గిని కారును జాన్వీకపూర్ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారులో పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనన్య బిర్లా రీసెంట్ గా మేకప్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ కు జాన్వీకపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతోంది. దానికి గిఫ్ట్ గా ఈ కారు ఇచ్చిందేమో అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా జాన్వీకపూర్ చాలా లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.