Prathibimbalu: నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని ‘ప్రతిబింబాలు’ చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.
Read also: Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు
నిజానికి ఆ కేంద్రంలో ‘ప్రతిబింబాలు’ చిత్రం నవంబర్ 9వ తేదీన విడుదలై ఒక్క ఆట మాత్రమే ప్రదర్శితమైంది. కానీ, ఫిబ్రవరి 16, 2023న ‘ప్రతిబింబాలు’ వందరోజుల ప్రకటన వెలుగు చూసింది. ఈ మధ్యలో ఆ థియేటర్ లో తాజాగా సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మొదటి రోజు ఆడింది. మరుసటి రోజు నుంచీ ‘వాల్తేరు వీరయ్య’ రెండువారాలు ప్రదర్శితమయింది. పక్కనే ఉన్న మండల కేంద్రం తవణం పల్లెలో ‘వీరసింహారెడ్డి’ రెండువారాలు ఆడి, మళ్ళీ మూడోవారంలో అరగొండ కృష్ణాటాకీస్ లో ప్రదర్శితమయింది. అప్పుడు తవణం పల్లెలో ‘వాల్తేరు వీరయ్య’ ఆడింది. ఈ మధ్యలో కొత్త సినిమాలు లేని సమయంలో కృష్ణా టాకీసు మూతపడిఉంది. ఆ థియేటర్ డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ అయిన ‘యు.ఎఫ్.ఓ.’ ద్వారా ఈ వివరాలన్నీ కంప్యూటర్ లో రికార్డయి ఉంటాయి. పాపం… ఇది తెలియని పురాతన అభిమానులు పాత రోజుల్లో అలవాటు ప్రకారం ‘ప్రతిబింబాలు’ చిత్రం వంద రోజులు ఆడినట్టు ప్రకటన ఇచ్చారు. ఈ విషయాన్ని ఇతర అభిమానులు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
Read also: Modi-Tamilisai Wishes: సీఎం కేసీఆర్ 69వ జన్మదినం.. ప్రధాని, గవర్నర్ సహా ప్రముఖుల విషస్
ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ తమ చిత్రాలను డబ్బులు ఇచ్చి మరీ ఆడియన్స్ రాకున్నా, కలెక్షన్స్ లేకున్నా వందరోజులు ఆడిస్తున్నారు. అయితే డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ కంప్యూటర్ రికార్డింగ్ కూడా ఉండేలా వారు సరి చూసుకుంటున్నారు. డబ్బులు పెట్టి ఆడించినప్పటికీ ఓ సినిమా నిజాయితీగా ఆడిందో లేదో తెలుసుకోవడానికి ఇది ప్రమాణం! అయితే, ఇలాంటివేవీ పట్టించుకోకుండా ‘ప్రతిబింబాలు’ వంద రోజులు ఆడినట్టుగా పేపర్ లో ప్రకటన ఇవ్వడమే ఇప్పుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
