నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని 'ప్రతిబింబాలు' చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.