పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ఓజీ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.ఏపీ లో రానున్న ఎన్నికల నేపథ్యం లో ‘వారాహి విజయయాత్ర’ లో పవన్ బాగా బిజీగా ఉండడం వల్ల సినిమాలో ఆయనతో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను అయితే చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం నటుడు ఇమ్రాన్ హష్మిపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు లో పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా అంతా పూర్తవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే, ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉండబోతుందని సమాచారం.. ఈ నేపథ్యం లో ఆ పాత్రకి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ ను ఇప్పటికే మూవీ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.. కానీ ఆయన ఆ పాత్రకు ఒప్పుకున్నాడా లేదా అనేది మాత్రం త్వరలోనే తెలియనుంది. ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఒక పాత్ర పేరు గాంధీ కాగా, మరో పాత్ర పేరు ఓజాస్ గంభీర అలియాస్ ‘OG’. మూవీ లో పవన్ కు అన్నయ్యగా కిక్ మూవీ ఫేమ్ శ్యాం, వదినగా శ్రియా రెడ్డి నటిస్తున్నట్లు సమాచారం.. ఇలా క్రేజీ క్యాస్టింగ్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.ఈ సినిమా లో ఇంత వరకు ఎప్పుడూ చూడని క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ను చూడబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు సుజిత్ తన ప్రతి సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లే ను అందిస్తాడు. ఈ సినిమాకు కూడా అదిరిపోయే స్క్రీన్ ప్లే అందించనున్నట్లు సమాచారం.