బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బి గా ఆయనకు ఉన్న గుర్తింపు బాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిందీ లోనే కాకుండా ఆయనకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగెటివ్ కామన్స్ చేయడానికి స్టార్ హీరోలు సార్థం భయపడుతుంటారు. కానీ పలువురు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. తాజాగా ఒక నెటిజన్ .. బిగ్ బిని అవమానించాడు. ముసలోడా అంటూ అగౌరవంగా మాట్లాడాడు. అలంటి నెటిజన్ కఐ కూడా అమితాబ్ ఎంతో ఓపిక్కగా సమాధానం చెప్పడమే కాకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నేటి ఉదయం బిగ్ బి 11.30 నిమిషాలకు గుడ్ మార్నింగ్ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
ఇక దీంతో పలువురు నెటిజన్లు 11.30 కు గుడ్ మార్నింగ్ ఏంటి..? ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా..? అని ఒక నెటిజన్ అడగగా.. “క్షమించాలి.. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే .. రాత్రంతా షూటింగ్ లో ఉండి ఉదయాన్నే వచ్చి పడుకున్నాను.. ఇప్పుడే లేచాను .. నేను లేచిన నిమిషం నాకు గుడ్ మార్నింగే కదా.. అందుకే అందరిని పలకరించాను” చెప్పుకొచ్చారు. ఇక మరో నెటిజన్ అయితే ‘ఇది మధ్యాహ్నం ముసలోడా’ అంటూ దురుసుగా మాట్లాడినా అతడి కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు బిగ్ బి.. “మీరు చాలా కాలం బతకాలని ప్రార్థిస్తున్నాను.. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో పెద్దవారిని ఎలా గౌరవించాలో చెంప పెట్టుమని చెప్పారు. ఇక అమితాబ్ కు పలువురు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ఎక్స్ పీరియన్స్ అంత వయస్సు ఉండదు నీకు.. ఆయనను అవమానిస్తావా..? అంటూ నెటిజన్స్ సదరు వ్యక్తిని విమర్శిస్తున్నారు.