Amitabh Bachchan: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంచి సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక చిత్ర బృందంలో ఎవరి బర్త్ డే అయినా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్తూ ఉంటారు మేకర్స్. తాజాగా నేడు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు కావడంతో ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు.
NTR AI Pics: దాదాసాహెబ్ ఫాల్కేగా జూ.ఎన్టీఆర్.. ఆహా !! ఆ ఊహే ఎంత బాగుందో!
“మీ ప్రయాణంలో భాగం కావడం మరియు మీ గొప్పతనానికి సాక్ష్యమివ్వడం ఒక గౌరవం. పుట్టినరోజు శుభాకాంక్షలు అమితాబ్ బచ్చన్ సర్” అని కల్కి టీమ్ మొత్తం బిగ్ బి కి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక పోస్టర్ లో కొండల మధ్య.. మునీశ్వరుడులా ముఖం మొత్తం కాషాయ వస్త్రాలతో కనిపించాడు. కేవలం కళ్లు మాత్రం కనిపించేలా మొత్తం ముసుగు ఉండడంతో అమితాబ్ యేనా అని అభిమానులు డౌట్ పడుతున్నారు. కొంతమంది ఆ డౌటే అక్కర్లేదు.. కటౌట్ ను చూసి నమ్మేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు. ఇక అమితాబ్.. టీజర్ లో కూడా ఇలాగే కనిపించాడు. దీంతో సినిమాలో అయినా ఆయన ఫేస్ చూపిస్తారా అన్నా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.