NTR AI Pics as Dada Saheb Phalke Goes Viral in Social Media: భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది? ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమిటనే అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. కథ, కథనాలతో పాటు ఈ సినిమా విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడుచెబుతుండగా మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్‌గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొనగా సౌత్ ఇండియా నుంచి ఒక స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Murali Sharma Wife: నటుడు మురళీ శర్మ భార్య ఈ నటి అని మీకు తెలుసా? అల్లు అర్జున్ నే వణికించింది!
భారతీయ సినిమా బయోపిక్ గా చెబుతున్న ఈ సినిమాను ‘భారత సినిమా పితామహుడు’ దాదాసాహెబ్ ఫాల్కే ఆధారంగా రూపొందించబడిందని అంటున్నారు. ఇక తాజాగా కొన్ని ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాకి ఎన్టీఆర్ కు సంబంధం లేదు కానీ ఆయనని ఈ సినిమాలో హీరోగా నటింపచేయమని ఆ ఫొటోలు షేర్ చేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ కనిపిస్తూ ఉండగా ఆ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా మరాఠీ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ అనే ఆరు భాషల్లో విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించే అవకాశం లేదు కానీ అసలు ఆ ఊహే ఎంత బాగుందో అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 https://t.co/uTpXZbYglv pic.twitter.com/5wJlIYuDc3
— Farooq (@farooq__9999) October 10, 2023