Allu Sirish Upcoming Movie: అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బడ్డీ” శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, నేహా జ్ఞానవేల్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గ తెరకెక్కుతున్న ఈ మూవీలో అజ్మల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా.. జూలై 26న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Also Read: Bharateeyudu 2 : 20 నిమిషాలు కాదు 12 నిముషాలే!
కానీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకుని విడుదలను వారం రోజులు వాయిదా వేశారు. ‘బడ్డీ’ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది అంటూ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసారు. తమిళ్ హీరో ధనుష్ నటించిన ‘రాయాన్’ చిత్రం జులై 26న తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుండగా, దీనికి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. తెలుగులో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ‘బడ్డీ’ నిర్మాతలు పోస్టుపోన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో శిరీష్ అయిన ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూద్దాం.
Get ready for the action-packed rom-com entertainer #Buddy 🧸 hitting theatres near you on 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝐧𝐝 🔥#BuddyTrailer 🔗 https://t.co/enjz6rEvwE#BuddyFromAug2nd 💥
A @hiphoptamizha Musical 🎹#StudioGreen @GnanavelrajaKe @AlluSirish @gaya3bh @Antonfilmmaker… pic.twitter.com/FhPIIdYLgs
— Studio Green (@StudioGreen2) July 17, 2024