2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. బన్నీ అత్యున్నత నటనా సామర్థ్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అల్లు అభిమానులు కాలర్ ఎగిరేసి గర్వించేలా చేసింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నటుడిగా, అల్లు అర్జున్ తన నటనా, నైపుణ్యాన్ని తనకున్న ప్రతిభను నిరూపించుకున్నాడు. అతనిపై ప్రజాదరణ భారతదేశం అంతటా ఏరులైపారింది.
Read Also: Guntur Kaaram: ఇద్దరు హీరోయిన్లు అన్నారు… ఒకరే కనిపిస్తున్నారు ఏంటి?
రాబోయే సంవత్సరాల్లో, అల్లు అర్జున్ వైవిధ్యమైన పాత్రలు చేయడం, బహుళ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ తన బహుముఖ ప్రజ్ఞను మరింత నిరూపించుకోబోతున్నాడు. ఆగస్ట్ 15, 2024న విడుదల కానున్న ‘పుష్ప 2’ అల్లు అర్జున్ నటన ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావింస్తున్నారు. తన నటనతో మళ్లీ పుష్ప2తో నటనలో మరో కోణాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఇందులో ఎలా కనిపించబోతున్నాడన్న ఆసక్తి నెలకొంది. పుష్పలో ఉన్న విధంగానే మళ్లీ పుష్ప2లో కనిపించబోతున్నాడా? పుష్ప2తో అభిమానులను మరో సారి ఎలా ఆకట్టుకోబోతున్నాడనేది చూడాలంటే ఆగస్టు 15వరకు ఆగాల్సిందే.
Read Also: Darshan: కర్ణాటకలో సలార్ స్పీడుకి బ్రేకులు పడ్డాయ్…