రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ని రీచ్ అయిన సలార్ సీజ్ ఫైర్, 600 కోట్లకి చేరువలో ఉంది. తెలుగులో అత్యధిక సార్లు 500 కోట్ల మార్క్ దాటిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగు రాష్ట్రాలు, నార్త్ బెల్ట్, ఓవర్సీస్ లో సలార్ సూపర్బ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సలార్ సినిమాకి మంచి బూస్ట్ అయితే రాలేదు కానీ కర్ణాటకలో పర్వాలేదు ఆనేలానే ఉంది. ఉగ్రమ్ సినిమాకి రీమేక్ గా సలార్ తెరకెక్కింది అనే ఫీలింగ్ లో ఉన్న కన్నడ సినీ అభిమానులు ఆశించిన స్థాయిలో సలార్ ని ఆదరించలేదు. నెగటివ్ ట్రెండ్ ఉన్న సమయంలో కూడా సలార్ సీజ్ ఫైర్ కర్ణాటకాలో ఇప్పటివరకూ 35.7 కోట్లని కలెక్ట్ చేసింది.
పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉంటే సలార్ సినిమా శాండల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గరే 50 కోట్ల మార్క్ రీచ్ అయ్యేది. కాస్త స్లోగా అయినా సరే సలార్ సినిమా కర్ణాటకలో 50 కోట్ల మార్క్ రీచ్ అవుతుంది అనుకుంటూ ఉంటే సలార్ సినిమాకి బ్రేకులు వేసింది ది బాస్ దర్శన్ నటించిన కాటేరా సినిమా. డిసెంబర్ 29న రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లో 37 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న కాటేరా సినిమా కన్నడ బాక్సాఫీస్ దగ్గర మంచి స్టార్ట్ ని సొంతం చేసుకుంది. సలార్ థియేటర్స్ ని కాటేరా ఆకుపై చేసింది కాబట్టి ఇకపై కన్నడ రీజన్ లో సలార్ సీజ్ ఫైర్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు.