Allu Arjun: నేడు ఫాదర్స్ డే అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రతి ఒక్కరికి తండ్రినే సూపర్ హీరో. అతను లేనిదే జీవితమే ఉండదు. ఇక నేడు ఫాదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు.. వారి తండ్రి ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే తాజాగా అల్లు వారసులు తన తండ్రి అల్లు అర్జున్ కు ఫాదర్స్ డే స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ కు ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ. అర్హ ఈ మధ్యనే శాకుంతలం సినిమాలో బాలనటిగా నటించి మెప్పించింది. నిత్యం తండ్రితో కలిసి ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు.
Kavya Kalyanram: బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్
ఇక నేడు ఫేడస్ర్ డే సందర్భంగా ఈ చిన్నారులు.. తండ్రి కోసం కేక్ తయారుచేసినట్లు తెలుస్తోంది. బన్నీకి కేక్ అందించి ఇద్దరు అతనిని అల్లుకుపోయారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ షేర్ చేస్తూ.. ” థాంక్యూ ఫర్ ది క్యూటెస్ట్ సర్ ప్రైజ్ మై బేబీస్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే బన్నీప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.