అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 హచిత్రంలో నటిస్తున్నాడు.. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే తానూ చేసే పనిలో నీతి, నిజాయితీ ఎంత ఉండాలి అనుకుంటాడో.. తన ఫ్యాన్స్ కి కూడా ఆ పని నచ్చేలా ఉండాలని కోరుకుంటాడు బన్నీ. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోట్లు ఇస్తామన్న ఒక ప్రకటనను రిజెక్ట్ చేశాడట బన్నీ. విషయం ఏంటంటే.. ఇటీవలే బన్నీకి పాన్ మసాలా కంపెనీ నుంచి పెద్ద ఆఫర్ వచ్చిందట.. పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే కోట్లు ఇస్తామని యాజమాన్యం ఆఫర్ చేయగా బన్నీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే దానికి కూడా కారణం లేకపోలేదు.
ప్రజల ఆరోగ్యానికి కలిగించే ప్రొడక్ట్స్ ని తాను ఎంకరేజ్ చేయనని, తనవల్ల తన అభిమానుల ఆరోగ్యం దెబ్బతింటుందని , అందుకే ఈ డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడట అల్లు అర్జున్. దీంతో సదురు బ్రాండ్ యాజమాన్యం వెనుతిరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ అభిమానులు బన్నీని ఆకాశానికెత్తేస్తున్నారు. అది బన్నీ అంటే.. అభిమానులను ఎంతో ప్రేమిస్తాడు అని కొందరు.. ఇంకొందరు బాలీవుడ్ యాక్టర్స్ లా డబ్బు కోసం ఏ యాడ్ పడితే ఆ యాడ్స్ చేయరు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి అంటే బన్నీ నోరు విప్పాల్సిందే.