Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 ఎంత సెన్సేషనల్ అయిందో మనకు తెలిసిందే. ఇందులోని పాటలు అన్ని వర్గాల వారిని ఊపేశాయి. అలాగే డైలాగులు, మ్యానరిజం అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులోని టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ పాటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ పాటకు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ స్టెప్పులేశారు. అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో కనిపిస్తోంది. ఈ పాట కోసం అతను చాలానే రిహార్సల్స్ చేశాడు.
Read Also : Tamarind Seeds: చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!
మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ చాలా సార్లు స్టెప్పుల కోసం డిస్కషన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ఇందులో మేనరిజాన్ని ప్రాక్టీస్ చేస్తుండటం కూడా చూపించారు. ఈ వీడియో విడుదలైన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. పుష్ప-2 దేశ వ్యాప్తంగా రూ.1820 కోట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసిందని మూవీ టీమ్ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు పార్టు-3 కూడా ఉంటుందని టీమ్ వెల్లడించింది. కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం బన్నీ తన తర్వాత సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు.