Allu Arjun: స్టార్ హీరోలు.. అభిమానుల దృష్టిలో ఒకేలా ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్స్ సైతం హీరోల ఎలివేషన్స్ పెంచుతూ ఉంటారు. ఇక అభిమానులను సంతృప్తి పర్చడానికి హీరోలు ఏదైనా చేస్తారు. కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. పాత్ర ఏదైనా గెటప్ ఏదైనా.. బన్నీ దిగనంత వరకే.. ఒక్కసారి దిగితే.. ఆ పాత్రలో ఉండేది బన్నీ కాదు. పుష్ప సినిమా కోసం బన్నీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. భుజం పైకెత్తి ఉండాలని చెప్పడంతో రోజు మొత్తం ఎత్తిన చెయ్యి దించకుండా షూటింగ్ చేసేవాడట. దానివలన భుజం నొప్పి కూడా వచ్చిందని సుకుమార్ పుష్ప ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కథ కోసం ఏదైనా చేస్తాడు బన్నీ. ఇక రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నేడు పుష్ప ఎక్కడ అనే స్పెషల్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు.
Nayanthara: పగిలిపోద్ది చెప్తున్నా.. అభిమానిపై నయన్ ఫైర్
ఇక ఇక్కడితో ఆగకుండా ఒక అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసి డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ రేపు రిలీజ్ చేయాల్సి ఉండగా.. అప్పటికే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అధికారికంగా ప్రకటించారట. పోస్టర్ లో అల్లు అర్జున్ కాళికా దేవిలా కనిపిస్తున్నాడు. చీర కట్టి, కాళికా మాత అవతారంలో ఫుల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక పుష్ప ఎక్కడ వీడియోలో బన్నీ గోరుకు నెయిల్ పాలిష్ ఉండడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత ఈ లుక్ రిలీజ్ చేయడంతోనే అర్ధమవుతోంది. పుష్ప ఈ గెటప్ లో తప్పించుకొని అడవిలోకి పారిపోయి ఉండొచ్చు అని. ఇక పోస్టర్ లో బన్నీ చీరతో, ఒంటినిండా నగలతో, ఒకచేత్తో గన్ తో కనిపించాడు. ఒక స్టార్ హీరో ఇలాంటి గెటప్ వేయాలంటే ఎలాంటి ట్రోల్స్ వస్తాయో అని బెదిరిపోతారు. కానీ, ఇక్కడ పుష్ప మాత్రం పాత్రకు కావాలంటే ఎలాంటి రిస్క్ అయినా చేస్తాను అని చెప్పేస్తాడు. అందుకు నిదర్శనమే ఈ పోస్టర్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై ఒక రేంజ్ లో హైప్ పెంచేసిందనే చెప్పాలి. ఈ పోస్టర్ చూసిన అభిమానులు నీ ధైర్యానికి జోహారయ్యా.. ట్రోల్స్ వస్తాయని తెలిసినా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.