Allu Arjun Comments at Mangalavaram pre release event:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాను అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెషన్ సెంటర్‌లో నిర్వహించగా ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తన ఫాన్స్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. తన అభిమానులే తన బలం అని తనకు అభిమానులే ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి తన మీద తనకే డౌట్ వచ్చినప్పుడు మీ నమ్మకం చూసి నమ్మకం తెచ్చుకుంటానని అన్నారు. ఇక మంగళవారం సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. అజయ్ కథ చెప్పినప్పుడు గర్వించేలా చేస్తానని అన్నాడు, అలానే టీజర్, ట్రయిలర్ చూస్తే నిజమే అనిపించింది అని అన్నారు. పుష్ప షూట్లో సుకుమార్ కి టీజర్ చూపిస్తే ఆయనే షాక్ అయ్యాడని అన్నారు.
Kalidas Jayaram: పెళ్లికి సిద్ధమైన విక్రమ్ నటుడు.. సైలెంటుగా షాకిచ్చాడుగా!
కొన్ని సినిమాల్లోనే వైబ్ ఉంటుంది, ఆ వైబ్ ఈ సినిమాలో ఉందని అన్నారు. ఇక ఈ సినిమా టెక్నీషియన్లు అందరూ చాలా అద్భుతంగ పని చేశారని అన్నారు. నటీనటులు ముఖ్యంగా పాయల్ కి ఆరెక్స్ 100 లానే ఈ సినిమా కూడా గుర్తుండి పోతుందని అన్నారు. ఈ సినిమా కథ నేను కూడా విన్నాను, ఈ సినిమాలో ఒక బోల్డ్ విషయం ఉంది, దాన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అజయ్ హ్యాండిల్ చేశాడని నమ్ముతున్నాను అని అన్నారు. లైఫ్లో మన సక్సెస్ ను ఓన్ చేసుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అలాంటివారిలో స్వాతి, ప్రణవ్ కూడా అలాగే అని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ గురించి చెబుతూ ఆయన తనకు ఇన్స్పిరేషన్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. స్వాతి రెండేళ్ల క్రితం వచ్చి సినిమా చేయాలనుకుంటున్నా అంటే దూకేయమని చెప్పానని బురదలో దిగితే కానీ లోతు తెలియదని చెప్పానని అన్నారు. ధైర్యం కోసం నేను ఉంటానని చెప్పినా సినిమా పూర్తి చేసి ప్రీ రిలీజ్ వరకు నా హెల్ప్ అడగలేదని అన్నారు. ఇక ఫైనల్ గా పుష్ప 2 షూటింగ్ ఎపిసోడ్ గురించి చెబుతూ జాతర ఎపిసోడ్ చేస్తున్నామని మరో ఈవెంట్ లో మాట్లాడుకోవచ్చని అన్నారు. ఇక పుష్ప 2 అస్సలు తగ్గేదే లేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.